దేశంలో పెద్ద‌ నోట్ల రద్దుతో సంక్లిష్ట‌ పరిస్థితులు ఏర్ప‌డ్డాయి: చ‌ంద్ర‌బాబు

విజయవాడలో ఈ రోజు 197వ బ్యాంకర్ల సదస్సు జ‌రిగింది. ఈ స‌ద‌స్సుకి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు హాజ‌రై, ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... దేశంలో పెద్ద‌ నోట్ల రద్దుతో సంక్లిష్ట‌ పరిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని, ఈ ప‌రిస్థితుల్లో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను సమర్థంగా ఎదుర్కోవాలని ఆయ‌న బ్యాంక‌ర్ల‌కు సూచించారు. దేశంలో క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగేలా కృషి చేయాలని అన్నారు. ఏపీ స‌ర్కారు అన్ని విషయాల్లోనూ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఆధార్ నెంబ‌రు అనుసంధానంతో అన్ని విష‌యాల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు.
Go Back to Shorts
chandrababu
demonitisation

More Telugu News